కరోనా వ్యాప్తి వల్ల పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు సాయంత్రం మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే.. ప్రతిపక్షాలు పది పరీక్షలను రద్దు చేయాలని.. డిమాండ్ చేశాయి. పలు ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఏడాదిలో సంక్షేమం కోసం రూ.43వేల కోట్లు ఖర్చు :సీఎం జగన్