ETV Bharat / city

Debits: మద్యం రాబడి హామీగా చూపి రూ.8,300 కోట్ల రుణం ! - AP heavily indebted with alcohol revenue guarantee

దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామంటూ గొప్పలు పోయిన ప్రభుత్వం ఇప్పుడు మద్యం రాబడినే హామీగా పెట్టి వేల కోట్ల రూపాయాల అప్పులు చేస్తోంది. తాజాగా ఒకేసారి రూ. 8 వేల 300 కోట్ల రుణం తెచ్చి మద్యనిషేధమనే మాటకు నిలువునా తూట్లు పొడిచింది. పాత అప్పులు తీరిస్తేగానీ.. మద్య నిషేధం హామీ అమలుకు నోచుకునే పరిస్థితిలేదు. ఆర్థిక భారంతో అల్లాడుతున్న ప్రభుత్వం. ఈ అప్పులు ఎప్పటికి తీరుస్తుంది.? మద్యనిషేధం ఎప్పటికి అమలు చేస్తుందన్నది అంతుచిక్కని ప్రశ్నే.

Rs 8,300 crore loan with alcohol revenue guarantee

author img

By

Published : Jun 12, 2022, 4:49 AM IST

Updated : Jun 12, 2022, 1:17 PM IST

మద్యం రాబడి హామీగా చూపి రూ.8,300 కోట్ల రుణం !

loan with alcohol revenue guarantee: దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని గొప్పలు పోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మద్యం రాబడినే హామీగా పెట్టి వేల కోట్ల అప్పులు చేస్తోంది. తాజాగా ఒకేసారి రూ.8,300 కోట్ల రుణం తెచ్చి.. మద్యనిషేధమనే మాటకు నిలువునా తూట్లు పొడిచింది. భవిష్యత్తులో మద్యనిషేధం విధించాలంటే ముందు ఈ అప్పులన్నీ తీర్చాలి. ఆర్థిక భారంతో అతలాకుతలమవుతున్న ప్రభుత్వం ఈ అప్పులు ఎప్పటికి తీరుస్తుంది.. మద్యనిషేధం ఎప్పటికి అమలు చేస్తుందన్నది అంతుచిక్కని ప్రశ్నే. ఇప్పటికే అప్పులకుప్పలా మారిన రాష్ట్రంపై మరో గుదిబండ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని చూపి తాజాగా రూ.8,300 కోట్ల రుణాన్ని సమీకరించింది. ప్రభుత్వ ఆదాయాన్ని ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ ఆదాయాన్ని ఎస్క్రో చేసి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్న అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఈ అప్పు తేవడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితితో సంబంధం లేకుండా బయట నుంచి కార్పొరేషన్‌ పేరుతో అప్పు తీసుకోవడంపైనా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.

రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియతో అప్పులా? : ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యంపై ప్రత్యేక మార్జిన్‌ విధించి, వసూలు చేసుకునేలా ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఇలా వసూలు చేసిన మొత్తం ఆ కార్పొరేషన్‌ ఆదాయమేననీ చట్టంలో పేర్కొంది. అంతకు ముందే ప్రభుత్వం మద్యంపై వ్యాట్‌ను తగ్గిస్తూ చట్ట సవరణ తెచ్చింది. ప్రభుత్వానికి వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక మార్జిన్‌గా వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించడం వివాదాస్పదమవుతోంది. తనకు ప్రత్యేక మార్జిన్‌ రూపంలో ఇంత ఆదాయం వస్తోందని చూపిస్తూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ రుణాలు సమీకరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.

‘రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలు ఉన్నాయి. ఆయా అంశాల్లో చట్టాలు చేసే అధికారం వాటికే ఉంది. రాష్ట్రంలో ఏ పన్నులైనా విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజ్యాంగంలోని 11వ షెడ్యూలు ఆర్టికల్‌ 243 (జి) 243 (హెచ్‌) ప్రకారం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు కొన్ని పన్నులు విధించుకుని, వసూలు చేసుకోవచ్చు. కానీ కంపెనీ చట్టం కింద ఏర్పడ్డ కార్పొరేషన్లకు ఇలాంటి అధికారమే లేదు’ అని నిపుణులు పేర్కొంటున్నారు. మద్యంపై వసూలు చేసే పన్ను అయినా, మార్జిన్‌ అయినా ఖజానాకు చేరాక, అప్రాప్రియేషన్‌ బిల్లులో పొందుపరిచి.. అప్పుడు కార్పొరేషన్‌కు బదిలీ చేసే అధికారం ఉంటుంది. అంతేకానీ నేరుగా కార్పొరేషన్‌ వసూలు చేసుకుని ఆదాయంగా వినియోగించుకోవడానికి వీల్లేదని నిపుణులు వాదిస్తున్నారు. ఇదే వాదనతో ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయగా సంబంధీకులందరికీ న్యాయస్థానం నోటీసులిచ్చింది. జూన్‌ 15న మళ్లీ ఈ అంశం విచారణకు రానుంది. ఈలోపే బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అప్పులు తీసుకోవడం గమనార్హం.

అప్పులపై ఇప్పటికే కేంద్రం గరంగరం: కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ నియంత్రణ విభాగం, ఆర్‌బీఐ, కాగ్‌ రాష్ట్ర అప్పులపై ఇప్పటికే కొరడా ఝళిపిస్తున్నాయి. రాష్ట్రం తీసుకునే ఏ అప్పు అయినా ఆ ఏడాది రాష్ట్ర జీఎస్‌డీపీ ఆధారంగా కేంద్రం నిర్ణయించిన రుణపరిమితికి లోబడి ఉండాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఏ రూపేణా అప్పు తీసుకున్నా ఆ వివరాలన్నీ సమర్పించాల్సిందేనని కాగ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి, తీసుకున్న అప్పుల వివరాలు సైతం అందించాలని కోరింది. ఆ అప్పుల వివరాలు ప్రభుత్వం సమర్పించకపోవడం వల్లే ఇప్పటికీ కిందటి ఆర్థిక సంవత్సరం లెక్కలు తేలలేదు.

  • మరోవైపు రాష్ట్రం ఇప్పటికే పరిమితికి మించి రుణాలు తీసుకున్నందున 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.28 వేల కోట్ల అప్పునకే కేంద్రం అనుమతిచ్చింది. ఆ పరిమితిని దాటి కార్పొరేషన్లు ఇలా వేరే రూపంలో రుణాలు తీసుకోవడం మరో వివాదం.
  • ఏపీఎస్‌డీసీ ద్వారా అప్పు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ఎస్క్రో చేసింది. ‘ఇది తప్పు. భవిష్యత్తు ఆదాయాలు తాకట్టు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. మీరు తప్పు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి’ అంటూ కేంద్ర ఆర్థికశాఖ లేఖ కూడా రాసింది. అలా తప్పు పట్టడం వల్లే ఆ విధానం మార్చి రాష్ట్ర ఆదాయాన్ని బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి మరీ అప్పులు చేయడమూ వివాదమవుతోంది.
  • మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్లకు అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థికశాఖ బ్యాంకులను కూడా హెచ్చరించింది. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు రుణాలు పుట్టించడానికి కొన్ని ఇబ్బందులూ ఎదురయ్యాయి. అలాంటిది ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ రూపేణా ఇంత మొత్తం అప్పు తీసుకోవడం వివాదాస్పదమవుతోంది.

మద్య నిషేధం హుళక్కే?: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉంది. అప్పు పుడితే తప్ప అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు. బహిరంగ మార్కెట్‌ రుణాలతో రాష్ట్ర అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి, దొడ్డిదోవన అప్పులు పుట్టిస్తోంది. మద్యం ఆదాయం లేకుండా ముందుకు సాగలేమని ప్రభుత్వం ఇలా చెప్పకనే చెబుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అప్పులన్నీ తీర్చడం ఇప్పట్లో అయ్యే పనికాదని, మద్యనిషేధం అటకెక్కినట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారీ వడ్డీతో.. : ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లు వేలం వేసి, కనీసం రూ.2,000 కోట్లు రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం రూ.8,300 కోట్లు సమీకరించినట్లు తెలిసింది. ఏకంగా 9.62 శాతం వడ్డీ చెల్లించేలా ఈ అప్పు తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్‌లో 8.85 శాతం వడ్డీకే రుణాలు లభిస్తుండగా ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ రెండు, మూడు సంస్థల ద్వారా అంత కంటే అధిక మొత్తం వడ్డీకి నిధులు సమీకరించడం గమనార్హం. ఇందులో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థే రూ.5,000 కోట్లకు పైగా సమకూర్చినట్లు చెబుతున్నారు. మిగిలిన మొత్తాలను ఏ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించారో తెలియాల్సి ఉంది. దీనిపై ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు.

ఇదీ చదవండి: తిరుమలలో భారీగా రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

Last Updated : Jun 12, 2022, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.