ETV Bharat / city

'కృష్ణ కిషోర్​పై కక్ష సాధింపే'

author img

By

Published : Feb 5, 2020, 10:28 AM IST

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణకిషోర్‌పై ప్రభుత్వ ప్రతీకార, కక్షపూరిత వైఖరితో చర్యలు చేపడుతోందని ఆయన తరఫు న్యాయవాదులు కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు. కృష్ణకిషోర్‌ను సస్పెండ్‌ చేయడం.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేయడంపై రాష్ట్రప్రభుత్వం వేసిన కౌంటర్‌ అఫిడవిట్‌కు సమాధానంగా ఆయన తరఫు న్యాయవాదులు రిజాయిండర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

ap govt on jasthi krishna kishore
ap govt on jasthi krishna kishore

రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఉద్యోగంలో నుంచి అకారణంగా తొలగించిందంటూ ఈడీబీ మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌లో రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. తనను సస్పెండ్‌ చేయడం, ఆర్థిక అవకతకలకు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్‌కు సమాధానంగా ఆయన తరఫు న్యాయవాదులు రిజాయిండర్ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌పై ట్రైబ్యునల్‌, అభియోగాల నమోదుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇప్పటికే స్టే మంజూరు చేసింది.

జాస్తి కృష్ణకిషోర్‌ తరఫున దాఖలు చేసిన అఫిడవిట్​లో న్యాయవాదులు కీలక విషయాలను వివరించారు. తన సర్వీసులో ఇప్పటివరకూ 23 సందర్భాల్లో ఉన్నతాధికారులు కృష్ణకిషోర్‌ పనితీరుపై రూపొందించిన నివేదికలలో ఆయనను ‘ప్రభుత్వానికి ఆస్తి’ అన్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న అధికారిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కక్షతో తప్పుడు అభియోగాలు మోపుతోందన్నారు. కేంద్రప్రభుత్వం కృష్ణకిషోర్‌కు ఆదాయపు పన్ను విభాగంలో చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి ఇస్తూ 2019 డిసెంబరు 12న సాయంత్రం 5 గంటలకు ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత రెండు గంటలకే ఆయనను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అర్ధరాత్రిలోపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆర్థికాభివృద్ధి మండలిలో పనిచేస్తున్న కాలంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని...ప్రభుత్వం మారిన తర్వాతే రాజకీయ కారణాలతో సస్పెండ్ చేశారు. ఈడీబీలో పదవులకు రాజీనామా చేసిన 6 నెలల తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

తప్పుడు మార్గంలో ఉద్యోగ నియామకాలు జరిగాయన్నది ప్రభుత్వ అభియోగం. సంస్థలో నియామకాలన్నీ ఏడాదికి.. ఆ లోపు వ్యవధిలోనే జరిగాయి. ఆ వ్యవధి పూర్తయ్యాక పనితీరును బట్టి కొనసాగింపు ఉంటుంది. ఈ నియామకాలను పారదర్శకంగా నిర్వహించారని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు. దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నా.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఏపీఈడీబీ కృషిచేసింది. వీటిలో 84 ప్రాజెక్టుల సివిల్‌ పనులూ ప్రారంభం అయ్యాయి. వీటిద్వారా 71 వేల, 508 కోట్ల పెట్టుబడులతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. మరో 167 ప్రాజెక్టులనూ తెప్పించేందుకు పనులు వివిధ దశల్లో సాగుతున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సీఎం సారథ్యంలో ఉన్నతస్థాయి బృందాలు పెట్టుబడుల కోసం జరిపిన విదేశీ పర్యటనలను ఈ సంస్థే నిర్వహించింది. తద్వారా 32 వేల670 కోట్ల విదేశీ పెట్టుబడులకు హామీలు లభించాయి. వీటి అమలు పూర్తయితే 45 వేల మందికి మందికి ఉద్యోగాలు లభించనున్నాయని వివరించింది.

ఏపీఈడీబీ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం మంచి ఉద్దేశంతో చేపట్టిన పనులపై ఎలాంటి న్యాయపరమైన చర్యలకూ అవకాశం ఉండదు. కృష్ణకిషోర్‌పై ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆ సెక్షన్‌ ప్రకారం చెల్లవు. కేంద్ర సివిల్‌ సర్వీస్‌ నిబంధనల ప్రకారం చూసినా ఈ చర్యలు చెల్లవని న్యాయవాదులు కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌కు వివరించారు. కృష్ణకిషోర్‌ తిరిగి ఆదాయపు పన్ను విభాగానికి వెళ్లి, తనకు వచ్చిన పదోన్నతిని చేపట్టకుండా చేయడం అన్యాయం. ఇది ఆయన భవిష్యత్‌ పదోన్నతులు, సీనియారిటీపై పడుతుందని వివరించింది.

ఇదీ చదవండి: 'కృష్ణ కిషోర్​ను చంద్రబాబు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.