ఈ ఏడాది రబీలో శనగలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 30 శాతం సబ్సిడీపై రైతులకు శనగలు పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్, ఏపీ సీడ్స్ అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి