నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు అంతర్జాతీయ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రయాణికులు, కార్గో విమానాలు నిర్వహించేందుకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేలా ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకుగానూ ఈ టెండర్లను పిలిచారు. ఆసక్తి ఉన్న సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఇన్ క్యాప్ సంస్థ నోటిఫికేషన్లో పేర్కోంది. నాలుగు నెలల్లోపు ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొదించాల్సిందిగా గడువు విధించింది. 1350 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది.
ఇదీ చదవండి