ETV Bharat / city

‘ఐఎంఎస్‌’ వేదికగా.. కరోనా నివారణే లక్ష్యంగా - coronavirus news

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకుగాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'ఐఎంఎస్'​ వేదికగా సమాచారాన్ని సేకరిస్తోంది.

incident management system
incident management system
author img

By

Published : May 24, 2020, 8:28 AM IST

కరోనా వైరస్‌ నివారణ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘ఇన్సిడెంట్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌’ (ఐఎంఎస్‌) వేదికగా యాప్‌లు, సహాయ ఫోన్‌ నెంబర్ల ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. తగిన చర్యలు చేపడుతోంది.

వాట్సాప్​ (8297104104) నంబరు ద్వారా...

వాట్సప్‌ నంబరు ద్వారా సుమారు 5 లక్షల మంది సమాచారాన్ని పొందారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలు, వైరస్‌ గుర్తింపు లక్షణాలు, ఇతర సమాచారాన్ని తీసుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది, క్వారంటైన్‌ కేంద్రాల వివరాలు, ఆ రోజు వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలను తెలుసుకోవచ్చు. ఎంచుకున్న అంశం ఆధారంగా వివరాలు అందుబాటులోకి వస్తాయి.

* ఇదే నంబరుకు ఫోన్‌ చేసి (ఐవీఆర్‌ఎస్‌) కరోనాకు వైద్యసేవలు ఏయే ప్రాంతాల్లో లభిస్తాయి? పరీక్షలను ఎక్కడ, ఎలా చేయించుకోవాలి? ఎవర్ని సంప్రదించాలో తెలుసుకోవచ్చు. పారిశుద్ధ్య పరిస్థితులు బాగా లేకున్నా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు ఈ నంబరుకు 10,814 మంది ఫోన్‌చేశారు.

104..(హెల్ప్‌ లైన్‌)కు అన్ని రకాల ఫిర్యాదులు చేయొచ్చు. వైరస్‌ వ్యాప్తి చెందేలా స్థానికులు ఎవరైనా వ్యవహరిస్తుంటే ఫోన్‌ చేయవచ్చు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సమాచారాన్నే కాకుండా ఇతర శాఖల సేవలనూ పొందొచ్చు.

14410..

(వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌) ద్వారా వైద్యుల సలహాలు, సూచనలు పొందేందుకు ఇప్పటివరకు 20వేల మంది పేర్లను నమోదు చేయించుకున్నారు. వీరిలో 347 మంది అనుమానిత లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు.

‘ఫార్మా యాప్‌’ను మెడికల్‌ షాప్‌ యజమానులు డౌన్‌లోడు చేసుకుంటున్నారు. వైరస్‌ అనుమానిత లక్షణాలతో మందుల కోసం ఎవరైనా షాపులకు వచ్చినట్లయితే వారి వివరాలను యాప్‌లో నమోదుచేస్తున్నారు. వీరిని గుర్తించి ఆరోగ్య సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.

‘కొవిడ్‌19ఏపీ’ మొబైల్‌ యాప్‌లో కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకోవాలనుకున్న వారు వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సుమారు 50వేల మంది ఈ యాప్‌ను డౌనులోడు చేసుకున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల సమాచారం, వైద్యాధికారుల పేర్లు, ఇతర సమాచారాన్నీ తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి:

కోర్టు ఆదేశాలిచ్చినా.. కార్యాలయాలకు పార్టీ రంగులు అద్దేశారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.