సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి రాజధాని భూముల అంశంలో హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలను ఎత్తివేయాలని సుప్రీంను కోరింది. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
అమరావతి భూముల అంశంపై ఏర్పాటు చేసిన సిట్, మంత్రివర్గ ఉపసంఘం తదుపరి కార్యాచరణపై హైకోర్టు ఇటీవల స్టే ఇచ్చింది. అమరావతి భూముల అంశంపై ప్రభుత్వం సోమవారం ఒక పిటిషన్ దాఖలు చేసింది.
ఇదీ చదవండి : దుర్గ గుడి రథం సింహాల కేసు...అనుమానితుల విచారణ