ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాల చెల్లింపులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. పలు విభాగాల ఉద్యోగులకూ 50 శాతం జీతాలే ఇవ్వాలని తేల్చింది. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి పూర్తి వేతనాలు, పింఛనుదారులకు ఈనెల మొత్తం సొమ్ము చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చింది. సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: