కేంద్ర మాజీ మంత్రి, భాజపా వ్యవస్థాపక సభ్యుడు జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జశ్వంత్ సింగ్ దేశానికి చేసిన సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. జశ్వంత్ సింగ్ భారత సైనికుడిగా, ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా, నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారని కొనియాడారు.
జశ్వంత్‌సింగ్ వాజ్‌పేయి ఎన్‌డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారని... విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ వంటి అనేక ముఖ్యమైన శాఖలను సమర్థవంతంగా నిర్వహించినట్లు గవర్నర్ హరిచందన్ తెలిపారు. 2002 నుంచి 2004 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆయన అమలు చేసిన వ్యాట్ విధానం ద్వారా రాష్ట్రాలు ఎక్కవ ఆదాయం సమకూరడానికి సహాయపడ్డాయన్నారు. జశ్వంత్ సింగ్ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని హరిచందన్ భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత