ఏపీ రాజధాని బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. సీనియర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న, ఇవాళ సీనిఆర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు, సూచనలు రాజ్‌భవన్ తెలుసుకుంటుంది. రాష్ట్రప్రభుత్వం నుంచి పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు వివరాలు అందగానే రాజ్‌భవన్ ఈ ప్రక్రియ ప్రారంభించింది.
ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపాలని ప్రతిపక్షాలు గవర్నర్ ను విజ్ఞప్తి చేశాయి. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంతో బిల్లులు ముడిపడి ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చల అనంతరం బిల్లులపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి : కరోనా నియంత్రణ కంటే ఎస్ఈసీపైనే సీఎం దృష్టి: తెదేపా నేత చినరాజప్ప