ETV Bharat / city

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం - ap governor approves ordinance on state budget

2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ అయింది. బడ్జెట్ ఆర్డినెన్స్ ను ఆమోదించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. ఆ తర్వాత వ్యవసాయం, విద్యా రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
ఏపీ బడ్జెట్ 2021-22
author img

By

Published : Mar 29, 2021, 3:51 AM IST

రాష్ట్రంలో తొలి మూడు నెలల కాలానికి ఆమోదించిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. ఆ తర్వాత వ్యవసాయం, విద్యా రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలలకు రూ.70,983.11 కోట్ల మొత్తానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ను ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపడంతో గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆర్డినెన్సు రూపంలో పంపి ఆమోదం తీసుకున్నారు. ఆర్డినెన్సును గెజిట్‌లో ప్రచురించేందుకు వీలుగా న్యాయశాఖ కార్యదర్శి ఆదివారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. అనంతరం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఆర్డినెన్సు జారీ అయినట్లు ఉత్తర్వులు విడుదల చేశారు. విభాగాధిపతులు, చీఫ్‌ కంట్రోలింగు అధికారులు వారి శాఖలకు నిర్దేశించిన మొత్తాన్ని మించి ఖర్చు చేయడానికి వీల్లేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.63,020.55 కోట్లను ఆయా శాఖలు ఖర్చు చేసేందుకు అంచనా మొత్తంగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో నిర్దేశించారు. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి చార్జ్‌డ్‌ మొత్తం కింద రూ.7,962.55 కోట్లు కేటాయించారు. ఈ మేరకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ఆమోదం పొందింది.

ఏడో వంతు వాటికే..
ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో సంక్షేమ రంగానికి సింహభాగం లభించింది. సాంఘిక, వెనుకబడిన తరగతులు, స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమంలో అన్ని కేటాయింపులూ కలిపి రూ.10వేల కోట్లు దాటాయి. మొత్తం బడ్జెట్‌ ప్రతిపాదనలో ఏడోవంతు సంక్షేమానికే కేటాయించారు. ఆ తర్వాత వ్యవసాయానికి రెవెన్యూ వ్యయం కింద రూ.7,171.26 కోట్లు, పెట్టుబడి వ్యయం కింద రూ.167.64 కోట్లు కేటాయించారు. ఖరీఫ్‌కు ముందే రైతు భరోసా నిధులు చెల్లించాల్సి రావడంతో ఈ మొత్తం కేటాయించినట్లు చెబుతున్నారు. భారీ, మధ్యతరహా, చిన్న నీటిపారుదల రంగంలో ప్రాజెక్టుల కోసం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించారు. ఈ రంగానికి మొత్తం మీద రూ.2,653 కోట్లు చూపారు. వైద్య ఆరోగ్య రంగానికి రూ.3,567 కోట్లు, విద్యారంగానికి సుమారు రూ.7,972 కోట్లు కేటాయించారు.

రూ.7,955.66 కోట్ల అనుబంధ పద్దు
రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.7,955.66 కోట్లతో అనుబంధ పద్దుకు ఆమోదం తెలిపారు. ఆ మేరకు ఆర్డినెన్సు జారీచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 నవంబరు 26 నుంచి 2021 మార్చి 31 వరకు శాఖలవారీగా తొలుత బడ్జెట్‌ కేటాయింపులకు మించి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ అనుబంధ పద్దునూ మంత్రిమండలి ఆమోదించడంతో గవర్నర్‌కు పంపి ఆమోదం పొందారు. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ కింద రూ.13.59 కోట్లు, శాఖల వారీగా అదనపు ఖర్చుకు రూ.7,942.07 కోట్ల మేర ఆమోదం తెలిపారు.

ఇదీ చదవండి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.