కడప ఉక్కు కర్మాగారంలో టాటా ఉక్కు సంస్థ పెట్టుబడిని ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందని తెలిసింది. స్వదేశీ ఉక్కు సంస్థలు టాటా, జేఎస్‌డబ్ల్యూ, ఎస్‌ఆర్, వేదాంత వంటి భారీ సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్‌ను దాఖలు చేశాయి. అన్ని అంశాలను పరిశీలించిన అధికారులు టాటా ప్రతిపాదనకు మొగ్గు చూపనున్నట్లు సమాచారం.
ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై సీఎం జగన్ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. మరో వారంలో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించిన తర్వాత..నిర్దేశిత సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఒక అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: