రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ఆదేశాలు వెలువరించింది.
అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లోని గదులు, వెంటిలేటర్లు, ప్రయోగశాలలు, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు, డాక్టర్లు, నర్సులు, మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది సేవల వినియోగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య నిపుణుల సేవలను అవసరమైన చోట తక్షణం వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: