ETV Bharat / city

టిడ్కో ఫ్లాట్ల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఆధ్వర్యంలో 94 పురపాలక సంఘాల్లో చేపట్టిన నివాస సముదాయాలను అర్హులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇవ్వనున్న 25 లక్షల పట్టాలు, ఇళ్లలో ఇవీ ఉన్నట్లు పేర్కొంది.

tidco flats in ap
tidco flats in ap
author img

By

Published : Mar 7, 2020, 5:28 AM IST

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై పట్టణ) కింద రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో నిర్మించిన జీ+3 ఫ్లాట్ల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఫ్లాట్లు ప్రభుత్వం పంపిణీ చేయనున్న 25 లక్షల పట్టాలు, ఇళ్ల జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మూడు రకాలు రుసుముల నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనాడు ప్రధాన పత్రికలో శుక్రవారం గూడు కట్టిన గోడు శీర్షికతో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్, వినియోగ రుసుముల నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పీఎంఏవై కింద ఏపీటిడ్కో 3.10 లక్షల జీ+3 ఫ్లాట్లు నిర్మించింది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇవ్వనున్న 25 లక్షల పట్టాలు, ఇళ్లలో ఇవీ ఉన్నట్లు పేర్కొంది. అమ్మకపు ఒప్పందం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్, వినియోగ రుసుముల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ 3.10 లక్షల జీ+3 ఫ్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు పట్టణ తహసీల్దార్లను సంయుక్త సబ్​ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.