గతంలో ఎన్నడూ లేనివిధంగా నగర సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల వరకూ, పట్టణాల సరిహద్దుల నుంచి 3 కిలోమీటర్ల వరకూ కొత్త బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పించింది. దీనివల్ల శివార్లలోనూ కొత్తగా బార్లు వెలుస్తాయి. గతంలో నగరాల సరిహద్దుల నుంచి 5 కిలోమీటర్లు, పట్టణాల సరిహద్దుల నుంచి 2 కిలోమీటర్ల వరకూ మాత్రమే బార్లు పెట్టే వీలు ఉండేది. వైకాపా అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి.
2019 నవంబరు 22న ప్రభుత్వం వాటి లైసెన్సులు అన్నింటినీ ఉపసంహరించుకుంది. 60శాతం వాటికే లైసెన్సులు కేటాయించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే తమకు 2022 జూన్ నెలాఖరు వరకూ కొనసాగే హక్కు ఉందని అప్పట్లో బార్ల యజమానులు కోర్టుకు వెళ్లగా అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రావటంతో అవి ఇప్పటివరకూ కొనసాగాయి. అప్పట్లో చట్టప్రకారం అవకాశం లేకపోయినా బార్ల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం.. ఇప్పుడు అవకాశం, అధికారం ఉన్నా తగ్గించలేదు.
ఇదీ చదవండి: