రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో అక్రమాలు నిజమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తప్పవని జాతీయ హరిత ట్రైబ్యునల్ హెచ్చరించింది. ప్రాజెక్టు పనులకు ఆదిత్యనాథ్ దాస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్జీటీ చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ కోసమే పనులు చేపట్టామని...రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్జీటీకి తెలిపారు. చేసిన పనులు దాయలేదని వివరించారు. డీపీఆర్ కోసం.. ఎంత పని చేయాలో ఎక్కడా విధి విధానాలు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. విచారణను ఎన్జీటీ ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: