కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు, ఈ విపత్తులో ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేయాలని కోరింది. చెక్కు రూపంలో విరాళం ఇవ్వాలనుకునేవారు 'చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్' పేరున పంపాలని సూచించింది. ఆన్‌లైన్‌లో పంపదలచినవారు ఎస్బీఐ అకౌంట్ నంబర్ 38588079208, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ SBIN0018884 కు పంపవచ్చని తెలిపింది. ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెంబరు... 110310100029039, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ ANDB0003079 కు పంపవచ్చని పేర్కొంది. వెబ్సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా వివరాలు పంపదలచినవారు apcmrf.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.
వందశాతం ఐటీ పన్ను మినహాయింపు
విరాళాలు పంపు దాతలు తమ సమగ్ర చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, విరాళాల ఉద్దేశం మొదలైన వివరాలను Special Officer to Hon'ble CM, గ్రౌండ్ ఫ్లోర్, 1వ బ్లాక్, ఏపీ సెక్రెటేరియట్ , వెలగపూడి చిరునామాకి పంపాలని అధికారులు తెలిపారు. విరాళాలు సమకూర్చిన దాతలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ, రశీదు, వందశాతం ఆదాయపు పన్ను మినహాయింపు ధ్రువపత్రం మొదలైనవి వైబ్సైట్ ద్వారా పొందవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
భాష్యం సంస్థల సహాయం
కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు భాష్యం విద్యాసంస్థలు ముందుకు వచ్చాయి. భాష్యం ఛైర్మన్ రామకృష్ణ.... సీఎం జగన్‌ను కలిసి రూ.25 లక్షలు విరాళం అందించారు.
ఇదీ చదవండి: