ETV Bharat / city

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌పై ప్రభుత్వం అఫిడవిట్‌ - జస్టిస్ రాకేశ్ కుమార్​పై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

ప్రభుత్వ భూముల విక్రయ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆస్తుల వేలం కేసుల్లో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపించారు

Government affidavit against Justice Rakesh Kumar
జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌పై ప్రభుత్వం అఫిడవిట్‌
author img

By

Published : Dec 16, 2020, 8:25 AM IST

మిషన్‌ బిల్డ్‌ ఏపీ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల విక్రయ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ వేసింది. మిషన్‌ ఆఫ్‌ ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌ ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద చేపట్టిన ఆస్తుల వేలం కేసుల్లో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపించారు. ఇలాంటి సహేతుకమైన ఆందోళన ఉన్నప్పుడు విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. మిషన్‌ బిల్డ్‌ ఏపీ పథకం ద్వారా విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్ని ఈ-వేలం ద్వారా విక్రయించే యత్నాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిలో విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తప్పుకోవాలని ప్రవీణ్‌కుమార్‌ తాజాగా అఫిడవిట్‌ వేశారు.

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన కథనాలను అఫిడవిట్‌తో జతచేశారు. వ్యాజ్యం విచారణకు ముందే ఓ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలే ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని చేసిన వ్యాఖ్యలు అవసరం లేనివన్నారు. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థా స్వీయనియంత్రణ పాటించాలన్నారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొచ్చుకొస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నుంచి తప్పుకోవాలని కోరారు. ప్రభుత్వ భూముల వేలం వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో ఈనెల 17న విచారణ ఉన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.