ప్రభుత్వం జారీ చేసిన జోవో రాష్ట్రంలోని ప్రభుత్వ, యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లలో... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనను ఆంగ్ల మాద్యంలోకి మారుస్తూ... పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ... వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంగ్ల మాధ్యమం అమలు కోసం ఉపాధ్యాయుల నియామకాలు, శిక్షణ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్ల మాధ్యమ బోధనలో ప్రావీణ్యం, అర్హత కలిగిన వారినే నియమించాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగానే ఒకటి నుంచి ఆరు తరగతులకు అవసరమైన పుస్తకాలు ముద్రించి, సరఫరా చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిని ఆదేశించింది.
ఇదీ చదవండి : 'ప్రాజెక్టుల్లో అవినీతిని త్వరలోనే బయటపెడతాం'