రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. దిల్లీలో మూడో రోజు పర్యటనలో భాగంగా.. విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ధాన్యం పెండింగ్ బకాయిలతో పాటు నివర్ తుపానుకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు మినహాయింపు ఇవ్వాలని పియూష్ గోయల్‌ని కోరినట్లు బుగ్గన చెప్పారు. అలాగే కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: కిడ్నాపర్లకు సినిమా చూపించి భార్గవ్ స్కెచ్!