ETV Bharat / city

ఏపీ ఎంసెట్​ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల - ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ డేట్స్

ఈ నెల 23 నుంచి 27 వరకు ఎంసెట్​ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈసారి ఎంసెట్​ కౌన్సెలింగ్ పూర్తిగా ఆన్​లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా ప్రత్యేక కమిషనర్ పేర్కొన్నారు. ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీలో ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు.

Ap emcet counselling 2020 dates
Ap emcet counselling 2020 dates
author img

By

Published : Oct 21, 2020, 7:21 PM IST

ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్​ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ప్రకటించారు. ఎంసెట్​ 2020 కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంసెట్​ ర్యాంకుల ఆధారంగా వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

ఏపీ ఎంసెట్​ 2020 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ sche.ap.gov.in ద్వారా​ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్‌) వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దీనిని http://apeamcet.nic.in ద్వారా చెల్లించవచ్చు.

వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 23 నుంచి 27 వరకు జరగనుంది.

కౌన్సెలింగ్ తేదీ ర్యాంకులు
అక్టోబరు 231 నుంచి 20,000
అక్టోబరు 2420,001 నుంచి 50,000
అక్టోబరు 2550,001 నుంచి 80,000
అక్టోబరు 2680,001 నుంచి 1,10,000
అక్టోబరు 271,10,001 నుంచి చివరి ర్యాంకు వరకు

ఇదీ చదవండి : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.