ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. ఎస్​ఈసీ పదవీకాలం కుదింపు - ఏపీ ఎన్నికల కమిషనర్ తొలగింపు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని... ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. పంచాయతీరాజ్ చట్టంలో ఎస్​ఈసీ నియామకానికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా మార్చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఫలితంగా ప్రస్తుత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ప్రభుత్వం రహస్యంగా జారీ చేసిన జీవోలు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం వల్ల విషయాన్ని బహిర్గతం చేసింది. కొత్త కమిషనర్‌ కోసం ఓ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పేరును గవర్నర్‌కు సిపార్సు చేసినట్లు తెలుస్తోంది.

Ap election commissioner removed by this process
రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. ఎస్​ఈసీ పదవీకాలం కుదింపు
author img

By

Published : Apr 11, 2020, 5:44 AM IST

ఎస్​ఈసీ పదవీకాలం కుదింపు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు, నియామకం, వేతనం చెల్లింపు అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్​ఈసీ పదవికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన వారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్ళకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

అంతా రహస్యంగానే...

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్‌, నోటిఫికేషన్‌ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. అన్నింటినీ అత్యంత రహస్యంగా ఉంచిన ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం కావడం వల్ల బహిర్గతం చేసింది.

షార్ట్ సర్కులేషన్ మెథడ్​తో నిర్ణయం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ మంత్రివర్గ ఆమోదం కోసం ఈనెల 7న పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రతిపాదన పంపించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రులకు గురువారం పంపించారు. ఎవరి నుంచీ అభ్యంతరాలు లేనందువల్ల ఆమోదం పొందినట్లు నిర్ధరించారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు సమయం లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా అనుసరించే ఈ పద్ధతిని 'షార్ట్ సర్కులేషన్ మెథడ్' అంటారు. గురువారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై తదుపరి కార్యాచరణ నిర్ణయించినట్లు సమాచారం. అదేరోజు సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గవర్నర్‌ను కలిసి ఈ అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శుక్రవారం ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయడం, ఉత్తర్వుల జారీ చకాచకా జరిగిపోయాయి.

విశ్రాంత న్యాయమూర్తి ఇక ఎస్​ఈసీ

కొత్త ఎస్​ఈసీ నియామకంపైనా ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఓ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పేరును ఇప్పటికే గవర్నర్‌ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రానికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పేరును ఎస్​ఈసీగా సిపార్సు చేసినట్లు సమాచారం. గవర్నర్‌ ఆమోదం తర్వాత.. నియామకంపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : ఎన్నికల వాయిదా నుంచి తొలగింపు వరకు... కారణాలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.