కొత్త కోర్సులకు ఉన్నత విద్యా శాఖ రూపకల్పన చేసిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, 4 ఏళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సు నేపథ్యంలో ఏడాది పీజీ కోర్సును ప్రవేశపెడుతున్నామని మంత్రి వెల్లడించారు. కళాశాలల తనిఖీకి క్వాలిటీ అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అకడమిక్ ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కోసం యూనివర్సిటీలు, కాలేజీల్లో ఇంక్యూబేషన్ సెంటర్స్ ఏర్పాటుకు ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీలకు రీసెర్చ్ బోర్డ్లు ఏర్పాటు చేస్తున్నామని, మరో నాలుగు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నత విద్యామండలి ప్లానింగ్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విద్యారంగం బలోపేతంకు ప్లానింగ్ బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.
'శాస్త్ర పరిశోధనలో ఎవరికీ తీసిపోం.. అన్ని రకాలుగా సత్తా చాటాం'