ఏపీ ఎంసెట్ ప్రాసెసింగ్ రుసుం, ధ్రువపత్రాల పరిశీలన గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 27వ తేదీతో గడువు ముగియగా...దీనిని నవంబర్ మూడో తేదీ వరకూ పొడిగించారు.
కళాశాలలు, కోర్సులు, ఐచ్ఛికాలు ఎంపికకు నవంబర్ 2 లేక మూడో వారంలో అవకాశం కల్పించనున్నారు. ఇప్పటి వరకు 82,840 మంది ప్రాసెసింగ్ రుసుం చెల్లించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది.
ఇదీ చదవండి : నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం