ETV Bharat / city

'కరోనా వ్యాప్తి చెందకుండా... కఠిన చర్యలు అమలు చేయండి'

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం సాహ్నిలు తమ కార్యాలయాల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్​డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ap dgp neelam sahni and dgp goutham
'కరోనా వ్యాప్తి చెందకుండా... చర్యలను కఠినంగా అమలు చేయండి'
author img

By

Published : Mar 24, 2020, 5:23 AM IST

జిల్లాల కలెక్టర్లతో సీఎస్​, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్​

కరోనా వైరస్ కట్టడి, లాక్​డౌన్ వంటి అంశాలపై సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్ల పైకి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపారు. వైద్యులు, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సిబ్బంది అధికారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు . విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి వెంటనే ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారిని గుర్తించేందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్లు ,ఎస్పీలకు సూచించారు .

మీడియాపై ఆంక్షలు లేవు...

నిత్యావసరాల వస్తువుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచించారు. మెడికల్ షాపు లు, మెడిసిన్ మినహా నిత్యావసర వస్తువులు రాత్రి 8 గంటల తరువాత విక్రయానికి అనుమతి లేదన్నారు. పండుగలు, పార్టీలు, ఫంక్షన్ లు, వివాహాలు, విహారయాత్రలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు తెలపాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకై డయల్ 100, 104కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవని... ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.

అతిక్రమిస్తే చర్యలు...

ఒక కాలనీలో వాహనంపై రెండు లేదా మూడు కిలోమీటర్లు మించి ప్రయాణించరాదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని... ఒకే వాహనం పలుసార్లు తిరిగినట్లు పోలీసుల దృష్టికి వస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. స్వాధీనం చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తర్వాతే తిరిగి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

కఠినంగా వ్యవహరిస్తాం

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను కఠినంగా అమలు చేస్తామని... నిబంధనలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కొన్ని విద్యాసంస్థలు బయట రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను బలవంతంగా బయటకు పంపిస్తున్నాయి. అటువంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు... విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోనే ఉండేలా చూడాలన్నారు.

ఇవీ చూడండి:

కరోనా అలర్ట్... ఏపీలో మరో పాజిటివ్ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.