ETV Bharat / city

'ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయాలి' - ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ వార్తలు

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయపడ్డారు. నిఘా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అరుదైన వృక్షాలను రక్షించాలని అటవీశాఖకు సూచించారు.

ap-cs-review-on-prevent-of-redasandal-smuggling-in-state

author img

By

Published : Feb 26, 2020, 5:01 AM IST

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్​ను నివారించేందుకు అటవీ,పోలీస్ శాఖలు పూర్తి సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రెడ్ సాండల్ (ఎర్ర చందనం)ప్రొటెకక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఎర్ర చందనం సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అటవీ, పోలీసు అధికారులతో సీఎస్ సమీక్ష

ప్రతిపాదనలు సిద్ధం చేయండి...

ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు అటవీశాఖకు ప్రత్యేకంగా ఇంటిలిజెన్స్ వింగ్​ను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి తగిన ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు, సిబ్బందికి తగిన నష్ట పరిహారాన్ని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటిలిజెన్స్ వ్యవస్థను మరింత అప్ గ్రేడ్ చేసి మెరుగైనరీతిలో సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

కేసుల వివరాలు వెల్లడి...

మరోవైపు 2003 నుంచి ఇప్పటి వరకూ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించి 15వేల 940 కేసులు నమోదు చేసి.. 14వేల 546 టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. 9వేల 694 వివిధ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 29వేల 235 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

ఆహార శుద్ధి పరిశ్రమలపై సమీక్ష

రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగానికి సంబంధించి పరిశ్రమల స్థాపన కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ సచివాలయంలో సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన 21 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.

ఇదీ చదవండి : ఆన్​లైన్ మోసానికి కాదేదీ అతీతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.