రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9544గా నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 34 వేల 940కి చేరింది.
ఇక రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1312 మందికి కరోనా సోకినట్టు తెలిపింది. చిత్తూరులో 1103, పశ్చిమగోదావరిలో 1131 మందికి కరోనా సోకింది. అనంతపురంలో 704 మందికి, గుంటూరులో 358 మందికి, కడపలో 343, కృష్ణా జిల్లాలో 265, కర్నూలులో 919, నెల్లూరులో 761, ప్రకాశం జిల్లాలో 797 మందికి, శ్రీకాకుళంలో 571 మందికి, విశాఖలో 738, విజయనగరంలో 542 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఇంకా 87 వేల 803 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 8827 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 2 లక్షల 44 వేల 45కు చేరింది.
పెరుగుతున్న మరణాలు
24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలోనే కరోనా మరణాలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 91 మంది కరోనా కారణంగా మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ కారణంగా చిత్తూరులో 16 మంది, పశ్చిమ గోదావరిలో 13, నెల్లూరులో 12, తూర్పుగోదావరిలో 11, అనంతపురంలో 8, కడపలో 7గురు, విశాఖలో 6, శ్రీకాకుళంలో 5గురు, ప్రకాశం జిల్లాలో 4గురు, గుంటూరు, కృష్ణా, కర్నూలులో ముగ్గురు చొప్పున మరణించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3092కు పెరిగింది. ప్రతి మిలియన్ జనాభాలో 58 వేల 612 మందికి నిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నిర్ధరణ పరీక్షలు చేస్తుకున్నవారిలో కొవిడ్ సోకుతున్న రేటు 10.7గా రాష్ట్రంలో నమోదైనట్టు వెల్లడించింది. ఇప్పటివరకూ 31 లక్షల 29 వేల 857 నిర్ధరణ పరీక్షలు చేస్తే అందులో పాజిటివ్ సోకిన వారి సంఖ్య 3 లక్షల 34 వేల 940గా ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిబంధనల చిక్కులు