ETV Bharat / city

ఇళ్ల నిర్మాణం వేగంగా జరగాలి: ముఖ్యమంత్రి జగన్ - cm jagan review on village and ward secretariats news

గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కావాల్సిన మౌలిక వసతులు తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

సీఎం వైఎస్ జగన్
సీఎం వైఎస్ జగన్
author img

By

Published : Mar 10, 2021, 4:21 PM IST

స్టీలు, సిమెంట్, ఇతరత్రా నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్లు కాకుండా సొంతంగా కట్టుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న వారికి నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై వెంటనే దృష్టి పెట్టాలని ఆదేశించారు. కరెంటు, నీళ్లలాంటి సదుపాయాలు లేవనే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదన్నారు.

కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇళ్లనిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, కచ్చితంగా నిర్మాణంలో నాణ్యత పాటించాలని చెప్పారు. జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలని పేర్కొన్నారు.

గ్రామ, వార్డు వాలంటీర్లకు పురస్కారాలపై అధికారులతో సమీక్షించిన సీఎం.. పలు సూచనలు చేశారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో వాలంటీర్లకు సత్కారం చేయాలన్నారు. 4 వేల మంది వాలంటీర్లకు సేవా రత్న, 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర ఇవ్వాలని తెలిపారు. సేవా మిత్రకు రూ.10 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా వజ్రకు రూ.30 వేలు అందజేయాలని ఆదేశించారు. వాలంటీర్లకు పతకం, ప్రశంసాపత్రం, బ్యాడ్జీలు ప్రదానం చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి

'నా ఓటెక్కడ..?' డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు మిస్సింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.