ETV Bharat / city

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి: సీఎం - సీఎం జగన్ సమీక్ష తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీతో పాటు అన్ని కొవిడ్​ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని కొవిడ్, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో నిర్ణీత ప్రమాణాలు తప్పక పాటించాలని.. అలా పాటించని వాటిని ప్యానల్ నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ap cm jagan review on corona
ap cm jagan review on corona
author img

By

Published : Oct 9, 2020, 4:54 PM IST

Updated : Oct 9, 2020, 5:11 PM IST

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్రలను నియమించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలు, సదుపాయాలకు గ్రేడింగ్‌ ఇవ్వాలని అన్నారు. ఈ ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

'ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో 6 ప్రమాణాలు కచ్చితంగా అమలు కావాలి. వైద్యులు, ఔషధాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వాలి, పారిశుద్ధ్యం బాగుండాలి. అన్ని కొవిడ్‌ ఆస్పత్రుల్లోనూ ఇవే ప్రమాణాలు పాటించాలి.'- ముఖ్యమంత్రి, జగన్

ఆరోగ్యమిత్రలు రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.104 కాల్‌సెంటర్‌ మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి మెడికల్‌ కిట్లు అందాలన్న ఆయన...వారికి వైద్యులు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు.

తగ్గుముఖం పడుతోంది...

రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పడుతోందని, పాజిటివిటీ, మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని సమావేశంలో అధికారులు వివరించారు.కరోనా టెస్టుల్లో రాష్ట్రం ఇవాళ దేశంలోనే అత్యధిక సామర్థ్యం కలిగి ఉందన్నారు.ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు 35,680, ట్రూనాట్‌ టెస్టులు 8,890 స్థాయికి చేరాయని వివరించారు. అన్ని చోట్లా మెరుగైన వైద్య సేవలందించేలా 10 వేల సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించగా, తాత్కాలికంగా 20 వేల మందిని నియమించడం జరిగిందన్నారు. వివిధ ఆస్పత్రుల్లో వైద్య నిపుణులకు సంబంధించి 2120 పోస్టులు మంజూరు అయ్యాయని, వాటిలో ఇప్పటి వరకు 1,116 పోస్టులు భర్తీ జరిగిందని.. మరో 1004 పోస్టుల భర్తీ జరుగుతోందన్నారు.

ఇదీ చదవండి

లైవ్​ వీడియో: భర్తతో మాట్లాడనివ్వట్లేదని అత్తపై కోడలు దాడి

Last Updated : Oct 9, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.