ETV Bharat / city

ఫిబ్రవరిలో 1-5 తరగతులు..!: సీఎం జగన్ - cm jagan latest news

ఏపీ సీఎం జగన్ విద్యాశాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌పై సమీక్ష చేపట్టారు.

AP CM Jagan
సీఎం జగన్
author img

By

Published : Jan 19, 2021, 4:10 AM IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మరుగుదొడ్లు లేకపోవడం, సక్రమంగా నిర్వహించకపోవడంతో చాలావరకు పాఠశాలలకు పిల్లలు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి 1-5 తరగతులకు కూడా పాఠశాలలు తెరవడంతో పాటు గతంలో మాదిరిగా అన్ని పీరియడ్స్‌ బోధించే అంశాన్ని పరిశీలించాలన్నారు. విద్యా కానుక టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతి వారికి ఆంగ్ల మాధ్యమంలో బోధనపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం రూపొందించిన మొబైల్‌ యాప్‌లపై సీఎం జగన్‌.. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు.

'మరుగుదొడ్ల నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, పాఠశాల, కళాశాల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇది ప్రాధాన్యాంశం. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయాలి. శుభ్రం చేసేందుకు వాడే రసాయనాలపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించాలి. సులభ్‌ వంటి సంస్థల అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యాసంస్థలను ‘నాడు-నేడు’ ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. ఆంగ్ల మాధ్యమంతో నాణ్యమైన బోధనను అందుబాటులోకి తెచ్చాం. విద్యార్థుల పోషకాహారం కోసం గోరుముద్దను అమలు చేస్తున్నాం' అని సీఎం జగన్‌ వెల్లడించారు.

విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌:

'విద్యార్థులు పాఠశాలలకు రాకపోతే తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు వెళ్లాలి. వాలంటీర్‌తో వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు దీన్ని పర్యవేక్షించాలి. యాప్‌లోని హాజరు వివరాలను తల్లిదండ్రులు పరిశీలించుకునే అవకాశం కల్పించాలి' అని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

బీటెక్ రవికి చంద్రబాబు ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.