జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై సీబీఐ నమోదు చేసిన కేసులో రెండో నిందితుడైన వి.విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్, అభియోగాల నమోదు ప్రక్రియపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు సోమవారం విచారణ చేపట్టారు.
సాయిరెడ్డి తరఫున యు.ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ... ‘జగతి పబ్లికేషన్స్ విలువను రూ.3500 కోట్లుగా అంచనా వేస్తూ 2007 జులై 12న జగదీశన్ నివేదికను సమర్పించారు. దీనిని సీబీఐ వెల్లడించకుండా కేవలం పాత తేదీలతో డెల్లాయిట్ నివేదికను తెప్పించారని ఆరోపిస్తోంది. వాస్తవానికి 2007లోనే తెప్పించినప్పటికీ 2008లో పాత తేదీలతో నివేదిక తెప్పించారంటూ అవాస్తవాలు చెబుతోంది. డెల్లాయిట్ రూ.2950 కోట్లు, ఎస్‌బీఐ క్యాపిటల్ రూ.2500 కోట్ల దాకా అంచనా వేసింది...’ అని వివరించారు. దీనిపై తదుపరి వాదనలు 19న కొనసాగనున్నాయి. సీబీఐ కేసుతో నిమిత్తం లేకుండా ఈడీ కేసు విచారణ చేపట్టవచ్చన్న అంశంపై నేడు సీబీఐ కోర్టు విచారణ కొనసాగించనుంది.
ఇదీ చదవండి: