ETV Bharat / city

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

రాష్ట్రంలో విద్యాసంస్థలు, సర్వీసుల్లో వెనకబడిన కులాల(ఏ,బీ,సీ,డీ,ఈ)కు రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి 2031 మే 31 వరకు వీటిని వర్తింపజేస్తారు. ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని.. పిల్లలు, భవనాలు, ఉపాధ్యాయులతో సహా అప్పగిస్తే పేరు మార్చకుండా ప్రభుత్వమే వాటిని నిర్వహించనుంది. అప్పగించడానికి యాజమాన్యాలు ఇష్టపడకపోతే.. ఎయిడెడ్‌ పోస్టుల్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేసి పూర్తిగా ప్రైవేటు కళాశాలలుగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
author img

By

Published : May 5, 2021, 4:03 AM IST

Updated : May 5, 2021, 5:51 AM IST

కేబినెట్ భేటీలు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35% సీట్లను కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వం తీసుకోనుంది. వీటిని పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు కేటాయించి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలను వర్తింపజేస్తారు. ఈ మేరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం 2016లో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2021-22 నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పూర్తిగా ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన జరగనుంది. 2024-25లో సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్ని దశలవారీగా అనుసంధానించేలా.. సీబీఎస్‌ఈ బోర్డు, పాఠశాల విద్యాశాఖ మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అర్చకులు, ఇమాంలు, మౌజంలకు జీతాలు పెంచాలని కూడా నిర్ణయించారు. విశాఖ అభివృద్ధికి కీలక ప్రాజెక్టులను ఆమోదించారు.

విశాఖ కేంద్రంగా వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం
విశాఖ కేంద్రంగా పర్యాటకాభివృద్ధికి సంబంధించి పలు ప్రాజెక్టులకు మంగళవారం జరిగిన మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా సుమారు వెయ్యి కోట్లతో వివిధ నిర్మాణాలు, పనులు చేపట్టేందుకు అనుమతించింది. వచ్చే ఏడాదికాలంలోే ఈ పనులను పూర్తి చేసేలా గడువును ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో ఈ పనులు చేపట్టనుంది. విశాఖకు తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ పర్యాటకపరంగా అభివృద్ధి చేపట్టేందుకు అవకాశం ఉన్న వాటిని వివరించారు.

చేపట్టబోయే పనుల్లో కొన్ని...

* భీమిలి నుంచి భోగాపురం వరకు రూ.600కోట్ల అంచనాతో 8వరుసల రహదారి.
* కైలాసగిరి కొండలో 5ఎకరాల్లో రూ.250కోట్ల అంచనాతో 20అంతస్తుల స్కై టవర్‌.
* రామకృష్ణా బీచ్‌ నుంచి భీమిలి వరకు 11బీచ్‌ల అభివృద్ధి.
* అన్నవరం వద్ద, భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ బీచ్‌ల అభివృద్ధి.
* భీమిలో గోస్తనీ నదిపై రెండు వేలాడే వంతెనలు.
* బంగ్లాదేశ్‌ నౌకను తీసుకుని ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా చేయాలి. దీని కోసం అంచనా వ్యయం రూ.10కోట్లు.

45 ఏళ్లు పైబడిన వారికే టీకా

'45 ఏళ్లు పైబడిన వారే ప్రధానంగా అత్యవసర పరిస్థితుల్లో ఉంటారు. ఇబ్బంది పడే అవకాశం వారికే ఎక్కువగా ఉంటుంది. వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమివ్వాలి. అదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం. టీకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేనందున మొదట 45 ఏళ్లు పైబడిన వారికే టీకాలు ఇవ్వాలని భావిస్తున్నాం' అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మూడు గంటలకుపైగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో గంటకుపైగానే కొవిడ్‌ పరిస్థితులపై చర్చ సాగింది. నియంత్రణ, పరీక్షలు, బాధితులకు వైద్యం అందించడం, ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారు, మనం రాష్ట్రంలో ఏం చేస్తున్నామనేది గణాంకాలతో సీఎం వివరించారు.

దేశంలో ఇప్పుడున్న వ్యాక్సిన్‌ ఉత్పత్తి లెక్కల ప్రకారం చూస్తే మన రాష్ట్రంలోని 45ఏళ్లకు పైబడిన వయసు ఉన్న కోటిన్నర మందికి రెండో డోసుల వ్యాక్సిన్‌ పూర్తి చేసేందుకే సెప్టెంబరు కావచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ కోసం కేంద్రాన్ని కోరుతున్నామని, కేంద్రం ఇచ్చే పరిస్థితి ఉన్నా లేకపోయినా మన పని మనం చేయాలని సీఎం చెప్పారు. 'ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సమస్యను పరిష్కరించుకునేందుకు సమయం ఇవ్వడం కోసమే రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ పెడుతున్నాం. ఈ సమయంలో ఆక్సిజన్‌ అందుబాటును పెంచాలి. కర్ఫ్యూ తర్వాత ఫిర్యాదులు రాకుండా ఉండే పరిస్థితి రావాలి. ఎంత ఖర్చయినా ఆక్సిజన్‌ సమస్య రాకుండా చూడండి.' అని ఆయన అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ కారణంగా మంత్రులు గౌతం రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారని సమాచారం.

రాష్ట్రంలో బుధవారం నుంచి 14 రోజులపాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో తెలిపారు. 'ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే రోడ్ల మీదకు అనుమతిస్తారు. తర్వాత వైద్యం కోసం తప్పితే.. ఇతర పనులపై రావొద్దు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలి.' అని కోరారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు తప్పితే.. రాష్ట్ర సరిహద్దుల్లోనూ ఇతర వాహనాలను అనుమతించరని చెప్పారు. రాష్ట్రంలో పడకలు పూర్తిగా భర్తీ అయ్యాయి, రెమ్‌డెసివిర్‌కు లోటు లేదు, ఆక్సిజన్‌ రవాణా త్వరితగతిన జరిగేందుకు వీలుగా సింగపూర్‌ నుంచి 20 వాహనాలను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి లేఖ రాగానే.. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి అందుకు అనుగుణంగా అన్నీ అమలు చేస్తామని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మాట స్పష్టంగా విన్పించడం లేదంటేనే..
మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న వారందరికీ స్పష్టంగా విన్పించేందుకే.. జగన్‌మోహన్‌రెడ్డి మాస్కు తొలగించి మాట్లాడారని మంత్రి పేర్ని నాని వివరించారు. కరోనా అదుపు చర్యల్లో అందరూ మాస్కులు పెట్టుకోవాలని చెబుతూ.. సీఎం మాత్రం విస్మరిస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఆ సమయంలో మిగిలిన వారంతా మాస్కులు ధరించే ఉన్నారన్నారు.

మంత్రిమండలి సమావేశం నిర్ణయాలివి...

  • ఏపీ డెయిరీ ఆస్తుల్ని లీజు విధానంలో అమూల్‌కు అప్పగిస్తారు. ప్రస్తుతం 708 గ్రామాల్లో రైతులు అమూల్‌లో సభ్యులుగా చేరగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సేవలు విస్తరించనున్నారు. ప్రకాశం పాల ఉత్పత్తిదారుల సంస్థ తీసుకున్న అప్పులు తీర్చి పునరుద్ధరించేందుకు రూ.69 కోట్లు ఏపీ డెయిరీ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
  • ఇక మీదట పట్టా భూములకు ఇచ్చే విలువకు పది శాతం అదనంగా పరిహారాన్ని ఎస్సీ, ఎస్టీల అస్సైన్డ్‌ భూముల రైతులకూ చెల్లిస్తారు.
  • రూ.511.79 కోట్లతో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మూడు పీహెచ్‌సీలు.
  • కడప ఉక్కు పనుల్ని.. ఎస్‌బీఐ క్యాప్‌ సిఫార్సు మేరకు ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన లిబర్టీ స్టీల్స్‌ నష్టాల్లో ఉన్నందున.. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రీవ్యాలిడేట్‌ చేసిన ఎస్‌బీఐ క్యాప్‌.
  • నాడు-నేడు కింద పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన సాల్ట్‌ (సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌)కు పదేళ్లలో తీర్చేలా ప్రపంచబ్యాంకు నుంచి రూ.1,860 కోట్ల రుణం.
  • బెస్టెక్‌ ఫుట్‌వేర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌(ఆడిడాస్‌ బూట్ల తయారీ సంస్థ)కు ఫ్రీ హోల్డ్‌ రైట్స్‌పై భూములు.. కడప జిల్లా పులివెందులలో రూ.70కోట్ల పెట్టుబడితో 2వేల మందికి ఉపాధి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగటూరులో రూ.700 కోట్ల పెట్టుబడితో 10వేల మందికి ఉపాధి కల్పించాలి. పూర్తి లక్ష్యం సాధించే దాకా లీజు విధానంలో భూములిచ్చి తర్వాత ఆస్తిగా మారుస్తారు.
  • మే 13న రైతు భరోసా పథకం కింద ఈ ఏడాది 54 లక్షల మంది రైతులకు రూ.4,050 కోట్లు జమ చేయనున్నారు. అలాగే 18న మత్స్యకార భరోసా కింద 1.34 లక్షల మందికి రూ.130.46 కోట్లను, 25న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2020 ఖరీఫ్‌ పంట నష్టానికి 38.30 లక్షల మంది రైతులకు రూ.2,589 కోట్లను ఇవ్వనున్నారు.
  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం
  • చెన్త్నె-బెంగళూరు, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక నడవాల మధ్య ఉండే కృష్ణపట్నం నడవా అభివృద్ధికి రూ.1,448 కోట్లు మంజూరు
  • హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్‌ -1 కింద ప్రధాన కాల్వ వెడల్పు, లైనింగ్‌, రెగ్యులేటర్ల విస్తరణకు రూ.6,182 కోట్లు, ఫేజ్‌-2 కింద అనంతపురం, మదనపల్లి సర్కిళ్లలో పనులకు రూ.9,318 కోట్లు మంజూరు
  • వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పనులకు రూ.2,746 కోట్ల రుణానికి ఆమోదం
  • కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల దాహార్తిని తీర్చేందుకు పోలవరం డెడ్‌ స్టోరేజి నుంచి నీటిని అందించేందుకు నిర్మించే ఎత్తిపోతలకు రూ.912 కోట్ల మంజూరు
  • ఏలేరు-తాండవ లింకు కాల్వకు రూ.470 కోట్ల మంజూరు. దీని ద్వారా 5,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 51,465 ఎకరాల స్థిరీకరణ
  • ఎలక్ట్రానిక్‌ పాలసీకి ఆమోదం. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పార్కుల్లో.. 80శాతం ఉద్యోగాలు మహిళలకే. కడప జిల్లా కొప్పర్తి వద్ద వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ అభివృద్ధి.
  • రూ.9.55 కోట్లతో శ్రీకాకుళం జిల్లా వెన్నెలవంకలో 30 ఎకరాల్లో, చిత్తూరు జిల్లా సదుంలో 10 ఎకరాల్లో పశుసంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు.
  • యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రొద్దుటూరు వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో భవనాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.66 కోట్లు, వేంపల్లి డిగ్రీ కళాశాల అభివృద్ధికి రూ.20 కోట్లతో పాటు పోస్టుల మంజూరు
  • చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం కొఠారుపల్లిలో మార్కెట్‌ కమిటీకి 4.52 ఎకరాల మంజూరు
  • నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గ్రీన్‌లామ్‌ సౌత్‌ ఇండియాకు 66.49 ఎకరాల భూమిని ఎకరా రూ.67.01 లక్షల చొప్పున కేటాయింపు. ఈ సంస్థ రూ.592 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా 850 మందికి ఉపాధి కల్పిస్తుంది.
  • రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తన సంస్థలతో ఒప్పందం చేసుకుని రైతుల భూముల్లోనే ధ్రువీకరించిన విత్తనాలు పండించడంతో పాటు, పశుసంవర్థకశాఖ భూముల్లోనూ ఇలాగే అమలయ్యేలా పశుగ్రాస భద్రతా విధానం 2021-26కి ఆమోదం.
    .
    .

ఇదీ చదవండి: వాట్సాప్​తో వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

Last Updated : May 5, 2021, 5:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.