ETV Bharat / city

జీవో 77ను రద్దు చేయండి.. సీఎంకు సోము వీర్రాజు లేఖ - ap bjp president

పేద, బలహీన వర్గాల విద్యార్థులకు భారంగా మారిన జీవో 77ను రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు ఆయన లేఖ రాశారు. ప్రతి విద్యార్థికి విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయాలని కోరారు.

ap bjp president somu veerraju
ap bjp president somu veerraju
author img

By

Published : Dec 30, 2020, 4:35 PM IST

సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. పేద, బలహీన వర్గాలకు శాపంగా మారిన జీవో నెంబరు 77ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ప్రయివేటు కళాశాలాల్లో చదివే విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సీటు దొరకని విద్యార్థులే ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటారని లేఖలో ప్రస్తావించారు.

పేద విద్యార్థులకు భారంగా మారనున్న ఈ జోవోను తక్షమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భాజపా తరపున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ ఈ రెండు పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. విదేశాల్లో చదవుకుంటున్న విద్యార్థులకు కూడా విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

విగ్రహాల ధ్వంసంపై ప్రధాని మోదీకి.. ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.