ETV Bharat / city

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు తగవు:బార్ కౌన్సిల్

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు తగవని ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు అన్నారు. గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారు దురదృష్టవశాత్తు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.

ap bar council chairman
ap bar council chairman
author img

By

Published : May 26, 2020, 7:14 AM IST

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు తగవని ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు అన్నారు. రాజ్యాంగ విధుల్లో భాగంగా తీర్పులిస్తున్న న్యాయవాదులను అసభ్యపదజాలంతో దూషించటం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తీర్పులపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు.

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మూడు విభాగాలుగా రాజ్యాంగపరమైన బాధ్యతలు అప్పగించందన్నారు. శాసన వ్యవస్థ చట్టాలు చేస్తే ఆ చట్టాలను కార్యనిర్వహక వ్యవస్థ అమలు చేస్తోందనన్నారు. చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోయినా, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినా...చట్టబద్ధత లేకపోయినా వాటిని సవరించటం , కొట్టేయడం న్యాయస్థానాల బాధ్యత అని గుర్తు చేశారు.

న్యాయమూర్తుల చర్చ !

న్యాయస్థానం హుందతానాన్ని దిగజార్చేలా పలువురు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని , సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. సోమవారం న్యాయమూర్తులందరూ అత్యవసర భేటీ నిర్వహించి ఈ వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టుకు ఎమ్మెల్సీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.