కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రధాని మోదీ ఆదేశించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల్ని పాటిస్తోందని .. ఎవరికీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటోందని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు గణనీయంగా పెరిగిందని కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఈ సీజన్లో 200 లక్షల టన్నుల పండ్లు, కూరగాయల ఉత్పత్తి జరిగిందని .. నిత్యం రైతు బజార్లు, సంచార రైతు బజార్ల ద్వారా మార్కెట్కు పంపుతున్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం... ఈ ఉత్పత్తులు ట్రక్కుల ద్వారా రవాణా అవుతున్నాయని స్పష్టం చేశారు. అటు ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి 54 కంటైనర్లు ఇటీవలే ఎగుమతి అయ్యాయని నాగిరెడ్డి తెలిపారు.
'నిబంధనలను పాటిస్తూనే..పంట ఉత్పత్తులు రవాణా' - వ్యవసాయంపై కరోనా ఎఫెక్ట్ లేటెస్ట్
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తులను మార్కెట్లకు తరలించటంతో పాటు... ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు.