ETV Bharat / city

కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు: మంత్రి కన్నబాబు

వచ్చే నెల 15 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ రైతుకీ ఏటా రూ.12,500 అందిస్తామన్నారు. ప్రకృతి విపత్తుల వలన నష్టపోయిన రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు.  కేంద్రం నుంచి అదనపు యూరియా కోరినట్లు స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువుల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ప్రకటించారు.

author img

By

Published : Sep 6, 2019, 7:45 PM IST

కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు : మంత్రి కన్నబాబు

అక్టోబర్ 15వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. భూమి ఉన్న రైతులందరితో పాటు కౌలు రైతులకూ ఏటా రూ.12,500 పెట్టుబడిసాయం అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. వైకాపా వందరోజుల పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రైతులకు వడ్డీ లేని రుణాలు, పంట బీమా, 2 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యానపంటలను పంట బీమా పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. కౌలు రైతుల లబ్ధికోసం కౌలు పత్రాన్ని తీసుకోస్తున్నట్లు కొబ్బరి తోటలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసినట్లు తెలిపారు.

ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో... రూ.119 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరిశోధనశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని వచ్చే ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. కొందరు యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనంగా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. కల్తీ ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. ఇకపై ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేసే సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాతే విత్తనాలు సరఫరా చేయాలన్న నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు రూ.7 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

హరిత రాజధానే మా ఆకాంక్ష: పవన్​ కల్యాణ్

Intro:రెడ్ శాండల్ సీజ్

Body:నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పి నాయుడు పల్లి వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు పోలీసులకి రాబడిన సమాచారం మేరకు పి నాయుడు పల్లి అటవీ ప్రాంతం వద్ద సోదాలు నిర్వహించగా అప్పటికే తరలించడానికి సిద్ధంగా ఉంచిన సుమారు 31 లక్షల విలువచేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటితో పాటు ఐదు మందిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసుల రాకను గమనించిన మరో ఐదు మంది అక్కడ నుండి పారిపోయారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎర్ర చందనం తరలించే వారిపై జిల్లా ఎస్పీ గట్టిగా నిఘా ఏర్పాటు చేశారని అలాంటి పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అలాగే ఎర్రచందనం కేసులో పట్టుబడిన ఐదుగురు ముద్దాయిల పై పలు సెక్షన్ల పై కేసులు నమోదు చేసినట్టు ఆత్మకూరు డి.ఎస్.పి మక్బూల్ తెలిపారు

Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.