ETV Bharat / city

Anupama: నిర్మల్​లో కర్లీ బ్యూటీ అనుపమ సందడి

తెలంగాణలోని నిర్మల్​ జిల్లా కేంద్రంలో సినీనటి అనుపమ సందడి చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్​ మాల్​ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనుపమను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

author img

By

Published : Aug 12, 2021, 6:34 PM IST

నిర్మల్​లో కర్లీ బ్యూటీ అనుపమ సందడి
నిర్మల్​లో కర్లీ బ్యూటీ అనుపమ సందడి
నిర్మల్​లో కర్లీ బ్యూటీ అనుపమ సందడి
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ మాల్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరయ్యారు. ఫ్యాషన్ మాల్​లో ఏర్పాటు చేసిన విభిన్న రకాల స్టాల్స్‌ను సందర్శించారు.

మాల్​లోని విభిన్న రకాల చీరలను ప్రదర్శించి ముద్దుగుమ్మ సందడి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యాటక ప్రాంతానికి అనుకూలంగా ఉందని అనుపమ తెలిపారు. రాబోయే రోజుల్లో సినిమా షూటింగులు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనుపమ వస్తుందని తెలుసుకున్న అభిమానులు మాల్​ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అందాల తారను చూసేందుకు బారులు తీరారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ట్రాఫిక్​కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

Sravanam Saare : AMIT SHAH: శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్రహోంమంత్రి.. కుటుంబీకులతో సందర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.