ETV Bharat / city

రుషికొండ తవ్వకాలను ఆపాలని.. ఎన్జీటీలో మరో పిటిషన్‌ - విశాఖ తాజా వార్తలు

రుషికొండలో తవ్వకాలపై ఎన్జీటీలో మరో పిటిషన్‌ దాఖలైంది. సర్వేనంబరు 19లో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారని విశాఖవాసి పిటిషన్​ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన ఎన్జీటీ జులై 29కి వాయిదా వేసింది. ఇటీవల ఎంపీ రఘురామ పిటిషన్​ను విచారించి.. తవ్వకాలపై స్టే విధించిన సంగతి తెలిసిందే.

NGT
ఎన్జీటీలో మరో పిటిషన్‌
author img

By

Published : Jun 3, 2022, 9:34 AM IST

విశాఖలోని రుషికొండపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దక్షిణాది జోన్‌ (చెన్నై)లో మరో పిటిషన్‌ దాఖలైంది. సర్వేనంబరు 19లో చేపడుతున్న ఈ పనుల్లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలతో పాటు వృక్షజాలానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, ప్రాజెక్టును వెంటనే ఆపాలని విశాఖకు చెందిన పీవీఎల్‌ఎం మూర్తి యాదవ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. దీనిని ఎన్జీటీ కోరం సభ్యులు జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, డాక్టర్‌ సత్యగోపాల్‌ కొర్లపాటి విచారణకు స్వీకరించారు. విచారణను జులై 29కి వాయిదా వేశారు. ఇదివరకే రుషికొండ తవ్వకాలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్​ విచారించిన ఎన్జీటీ తవ్వకాలపై స్టే విధించింది.

ఇప్పటి వరకు ఏం జరిగిందంటే..: NGT on Rishikonda: తాము తదుపరి విచారణ చేపట్టే వరకూ రుషికొండపై పర్యాటకాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్మాణాలకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలకు (ఏపీటీడీసీ) నోటీసులు జారీ చేసింది. పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమైన రుషికొండపై నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్జీటీ ప్రధాన ధర్మాసనంలో (దిల్లీ) పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన ఎన్టీటీ.. ఈ అంశంపై విచారణకు సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ మార్చి 29న నివేదిక అందజేసింది. దానిపై ఎన్జీటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, విషయ నిపుణుడు ప్రొఫెసర్‌ ఎ.సెంథిల్‌వేల్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి తాజాగా ఉత్తర్వులను వెలువరించింది. ‘సంయుక్త నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అన్నా యూనివర్సిటీ చేసిన మ్యాపింగ్‌ ప్రకారం రుషికొండ తీరప్రాంత క్రమబద్ధీకరణ జోన్‌ పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ ఈ విషయాన్ని తీర ప్రాంత యాజమాన్య మండలి (సీజడ్‌ఎంపీ) నుంచి నిర్ధారించుకోవాల్సి ఉంది. పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమైన కొండపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ప్రస్తుత ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనా అని తెలుసుకునేందుకు స్వతంత్ర కమిటీతో నిర్ధారించుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం జాతీయ తీర ప్రాంత యాజమాన్య మండలి (ఎన్‌సీజడ్‌ఎంఏ), ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంత యాజమాన్య మండలి (ఏపీసీజడ్‌ఎంఏ), జాతీయ సుస్థిర తీరప్రాంత యాజమాన్య మండలి (ఎన్‌సీఎసీఎం) సభ్యులుగా కమిటీని నియమిస్తున్నాం. ఈ కమిటీ ప్రస్తుత ప్రాజెక్టు పర్యావరణపరంగా ఆచరణ సాధ్యమేనా? సీఆర్‌జడ్‌ ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలా అనే విషయాన్ని పరిశీలించి నెలలోపు నివేదిక సమర్పించాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం జులై 11వ తేదీకి వాయిదా వేసింది.

Rushikonda excavations: రిషికొండలో తవ్వకాలపై ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం.. గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. అవసరం అనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని తెలిపింది. తవ్వకాలపై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో ధర్మాసనం విభేదించింది. ప్రతివాదిగా ఉన్న రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

విశాఖ తీరంలోని రుషికొండలో కొత్తగా తవ్విన ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘10, 20 ఏళ్ల క్రితం తవ్వకాలు జరిపి ఉంటే దాని గురించి మేం పట్టించుకోం. ఫొటోల్లో చూస్తే ఇటీవల తవ్వినట్లే కనిపిస్తోంది. అందువల్ల అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు’ అని పేర్కొంది. రుషికొండలో నిర్మాణాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా గ్రీన్‌ ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టడం సరికాదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ అంశంపై హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకూ నిర్మాణాలను కేవలం పాత భవనాలున్న ప్రాంతానికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ‘మా అభిప్రాయం ప్రకారం భౌగోళిక పరిధి విషయంలో ఏ ట్రైబ్యునల్‌ అయినా సంబంధిత హైకోర్టుకు సబార్డినేట్‌కిందే లెక్క. అందువల్ల హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన ఈ అంశంపై ఎన్జీటీ విచారణ సరికాదు. అందువల్ల ఎన్జీటీ ముందున్న విచారణను నిలిపేస్తున్నాం. అయితే ప్రస్తుత నిర్మాణ పనుల్లో విచ్చలవిడిగా ఉల్లంఘనలు జరుగుతున్నట్లు రఘురామకృష్ణరాజు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నందున ఆ అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడానికి అనుమతిస్తున్నాం’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పష్టంచేశారు. కక్షిదారులంతా తమ అభిప్రాయాలను హైకోర్టుకు నివేదించవచ్చని సూచించారు.

ఇప్పటికే కోర్టు ధిక్కరణ నోటీసులు..: అంతకుముందు రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. రుషికొండపై రిసార్ట్స్‌ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ కొండ సహజ రూపాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. తాము మంగళవారం కొత్త ఫొటోలు తీయించామని, ఇప్పటికే కొండను భారీగా తవ్వేశారని, ఇంకా అనుమతిస్తే కొండ పిండయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. కొండను చదును చేసి రిసార్ట్స్‌ నిర్మిస్తున్నట్లు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ నిర్మాణాలపై ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేయగా.. కోర్టు నోటీసులు జారీచేసిందని చెప్పారు. జస్టిస్‌ గవాయ్‌ జోక్యం చేసుకుంటూ.. ఒకవేళ వాళ్లు కోర్టు ధిక్కరణకు పాల్పడితే హైకోర్టు జైలుకు పంపుతుందని స్పష్టం చేశారు. ఈ విషయమై మీరు వెంటనే హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. అందుకు న్యాయవాది స్పందిస్తూ ఆలోపే ప్రభుత్వం కొండను మొత్తం చదును చేసేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.