తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో తాజాగా 1873 మందికి పాజిటివ్‌గా నిర్థరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,24,963కు చేరింది. వైరస్‌కు మరో 9 మంది బలవ్వగా... మొత్తం మరణాల సంఖ్య 827కు చేరింది. మహమ్మారి నుంచి ఒక్కరోజే 1849 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు 92 వేల 837 మందికి వ్యాధి నయమైంది.
తెలంగాణలో ప్రస్తుతం 31 వేల 299 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 వేల 216 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 360 మందికి వైరస్ సోకింది. జిల్లాల్లోనూ కొత్తగా పదుల సంఖ్యలో బాధితులు వ్యాధి బారిన పడుతున్నారు.
కరీంనగర్ 180, రంగారెడ్డి 129, ఖమ్మం 103 వరంగల్ అర్బన్, నిజామాబాద్‌లో 94 , సిద్దిపేట 85, నల్గొండ 79, జగిత్యాల 77, సూర్యాపేట 65, మహబూబాబాద్ 54, భద్రాద్రి కొత్తగూడెం 51, మంచిర్యాల 48, మేడ్చల్ మాల్కాజిగిరి 41, నాగర్‌కర్నూల్ 36 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ మరణాలు, రికరవరీ రేటు జాతీయ సగటు కంటే రాష్ట్రం మెరుగ్గా ఉందని వైద్యారోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి: పేద, మధ్యతరగతిపై నిత్యావసరాలు, కూరగాయల భారం