ETV Bharat / city

రాష్ట్రానికి మరో 16.31 లక్షల డోసులు: సింఘాల్ - vaccination Latest news

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి 16.31 లక్షల డోసులు రాష్ట్రానికి వచ్చాయని.. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్​కుమార్ సింఘాల్ వెల్లడించారు. మొదటి దశలో వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి రెండో డోసుతో పాటు రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఈ డోసులు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

Another 16.31 lakh doses for the state: Singhal

author img

By

Published : Feb 2, 2021, 7:35 PM IST

పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన సిబ్బందికి రెండో విడతలో వ్యాక్సినేషన్​ను ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభిస్తున్నట్టు... వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్​కుమార్ సింఘాల్ తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి అందుకు అనుగుణంగానే వ్యాక్సినేషన్ వేయాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసినట్టు సింఘాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ఇప్పటికే 2102 సెషన్ సైట్లను ప్రభుత్వం గుర్తించిందని.. వీటితోపాటు మరో 1079 సెషన్ సైట్లు పంచాయతీరాజ్, పురపాలక, రెవెన్యూ శాఖలకు చెందినవి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3181 సెషన్ సైట్ల ద్వారా వ్యాక్సినేషన్ వేసేందుకు అవకాశముందని వివరించారు.

ఇదీ చదవండీ... 'అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.