ETV Bharat / city

భద్రాద్రి రామయ్యకు సహస్ర కలశాభిషేకం - sahasra kalasabhishekam in bhadrachalam news

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారామలక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

Anointing with thousand kalasam in bhadrachalam
భద్రాద్రి రామయ్యకు సహస్ర కలశాభిషేకం
author img

By

Published : Feb 27, 2021, 1:26 PM IST

తెలంగాణలోని భద్రాచలం క్షేత్ర శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములకు 1001 కలశాలతో అభిషేకం నిర్వహించారు. సమస్త నదీజలాలు, సముద్ర జలాలు, పళ్లరసాలు, పంచోదకములు, పాలు, తేనె, నెయ్యి, సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు.

అనంతరం మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. మహా పూర్ణాహుతి అనంతరం స్వామి వారికి ప్రధాన ఆలయంలో మహా నివేదన సమర్పిస్తారు. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

శ్రీవారి సేవలో ప్రముఖులు.. పీఎస్ఎల్​వీ-సీ51కు ఇస్రో ఛైర్మన్ పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.