ETV Bharat / city

కాలుష్య కారక పరిశ్రమలపై గ్రీన్​ ట్యాక్స్ - ఆంధ్రప్రదేశ్​లోని పరిశ్రమలకు గ్రీన్ ట్యాక్స్

రాష్ట్రంలోని కాలుష్య కారక పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శాస్త్రీయ విధానంలో శుద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఏపీ ఎన్విరాన్​మెంటల్ మేనేజ్​మెంట్​ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తీవ్రమైన కాలుష్యాన్ని, వ్యర్థాలను విడిచిపెట్టే పరిశ్రమల నుంచి గ్రీన్ ట్యాక్స్​ను వసూలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

pollution
author img

By

Published : Nov 17, 2019, 4:41 AM IST

రాష్ట్రంలో తీవ్రమైన కాలుష్యాన్ని, వ్యర్థాలను విడిచిపెడుతున్న పరిశ్రమలకు హరితపన్ను(గ్రీన్ ట్యాక్స్) వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఏపీ ఎన్విరాన్​మెంటల్ మేనేజ్​మెంట్​ కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్ధాలను నిర్వహించటంతో పాటు వాటిని శుద్ధి చేసే అంశాలను ఈ కార్పొరేషన్ చేపట్టనుంది. దీనిలో కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా నియమితులు కానున్నారు.

రెడ్​ కేటగిరీలో 2 వేల పరిశ్రమలు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9 వేల పరిశ్రమలు ఉంటే.. అందులో 2 వేల పరిశ్రమలు రెడ్ కేటరిగీలో ఉన్నాయి. వీటి నుంచి నిత్యం తీవ్రమైన వ్యర్థాలు వెలువడుతున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా రోజూ 196 మిలియన్ లీటర్ల నీరు కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. 9 వేల పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు దాదాపు 5.50 లక్షల టన్నులుగా కాలుష్య నియంత్రణ మండలి లెక్కిస్తోంది. ఇందులో 31 వేల టన్నుల వ్యర్థాలు రీసైకిల్ చేసేందకూ వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. వ్యర్థాల సమర్థ నిర్వహణకు ఆయా పరిశ్రమలకు గ్రీన్ టాక్స్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించటంతో పాటు సరైన విధానాల్లో డంపింగ్ చేసేందుకు ఏపీ ఎన్విరాన్​మెంటల్ కార్పొరేషన్ కార్యాచరణ చేపడుతుంది. దీనికోసం ప్రత్యేకమైన విధివిధానాలను రూపొందించనున్నారు. వ్యర్థాల రవాణా, నిర్వహణనూ ట్రాక్ చేసే బాధ్యతల్ని ఏపీఈఎంసీకి ప్రభుత్వం అప్పగించనుంది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.