రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలోని పలుచోట్ల రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్రాలో మూడు రోజులు ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో ఈరోజు, రేపు.. పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని... ఎల్లుండి ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.