ETV Bharat / city

IPS: ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ - IPS

Transfers Three IPS Officers: ఆంధ్రప్రదేశ్​లో వివిధ శాఖలకు చెందిన ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ.. సాధారణ పరిపాలన శాఖ, ఏపీ స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్​లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులకు స్థానచలనం కల్పించింది. మెుత్తం ముగ్గురిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Transfers
ఐపీఎస్ అధికారులను బదిలీ
author img

By

Published : Oct 12, 2022, 9:44 PM IST

AP Government Transfers Three IPS Officers: రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్​గా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్​ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఏపీ స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎన్. సంజయ్​ని రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్​గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక పోలీసు శిక్షణ విభాగం ఐజీ పి. వెంకట్రామిరెడ్డిని ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.