ETV Bharat / city

'రాజకీయ లబ్దికోసమే జలవివాదం' - AP

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నూతన జాబ్ క్యాలెండరు విడుదల చేసే వరకు విద్యార్ధి, యువజన సంఘాలకు మద్దుతుగా నిలుస్తామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

సీపీఐ కార్యదర్శి కే రామకృష్ణ
సీపీఐ కార్యదర్శి కే రామకృష్ణ
author img

By

Published : Jul 1, 2021, 6:55 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికలప్పుడు దోస్తీ కట్టే ముఖ్యమంత్రులు జల వివాదాలప్పుడు మౌనం వహించడం రాజకీయ డ్రామా లేనంటు విమర్శించారు.

సజ్జల నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అధికార పార్టీ నేతలు ముంపు గ్రామాలను పరిశీలించక పోవడం దారుణమన్నారు. ఫొటోలు దిగడానికే పోలవరం ప్రాజెక్టును సందర్శించారని ఆరోపించారు.

నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు విద్యార్ధి, యువజన సంఘాలకు మద్దతుగా నిలుస్తామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: TDP MLCs letters : శాసన పరిషత్ కార్యదర్శికి తెదేపా ఎమ్మెల్సీల లేఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.