ETV Bharat / city

ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్.. సీఐడీ అధికారుల విచారణ

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజును.. ఏపీ సీఐడీ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ప్రభుత్వంపై అవిధేయతను ప్రోత్సహిస్తున్నారనే అభియోగంపై హైదరాబాద్‌లో రఘురామను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. అరెస్టు అక్రమమని, బెయిల్‌ మంజూరు చేయాలంటూ.. రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.

K Raghu Rama Krishna Raju arrest
K Raghu Rama Krishna Raju arrest
author img

By

Published : May 15, 2021, 3:59 AM IST

ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక విధానాలపై కొంతకాలంగా విమర్శలు చేస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజును.. సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. తొలుత రఘురామకృష్ణరాజుకు ఇంటికి వచ్చిన సీఐడీ పోలీసులను.. ఎంపీ భద్రతా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది, రఘురామ కుమారుడు భరత్‌ అడ్డుకునే యత్నంచేశారు. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు అనుమతిస్తేనే ఎంపీని అదుపులోకి తీసుకునేందుకు అంగీకరిస్తామని భద్రతా సిబ్బంది సీఐడీ అధికారులకు తేల్చిచెప్పారు. ఫలితంగా కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

ఆ తర్వాత సీఐడీ అధికారులు సీఆర్ఫీఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడి రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు కుటుంబసభ్యులకు నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోకపోవడంతో.. సీఐడీ అధికారులు ఎంపీ భార్య రమాదేవికి ఇస్తున్నట్లుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద గోడకు నోటీసు పత్రాన్ని అంటించారు. రఘురామపై ఐపీసీ సెక్షన్‌ 124 (1), 158, 505 రెడ్‌విత్‌ 1204 సెక్షన్ల కింద మంగళగిరిలోని సీఐడీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందని.. ఈ కేసులోనే ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు నోటీసులో తెలిపారు. ఇది నాన్‌ బెయిలబుల్‌ కేసు అని.. న్యాయస్థానం ద్వారా మాత్రమే బెయిల్‌ పొందేందుకు వీలుందని పేర్కొంటూ సీఆర్​పీసీలోని సెక్షన్‌ 50(2 ) ప్రకారం నోటీసు జారీచేస్తున్నట్లు స్పష్టం చేశారు.

వాస్తవమని తేలటంతోనే కేసు: ఏడీజీ సునీల్‌కుమార్‌

రఘురామను రోడ్డు మార్గంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌.. ఎంపీని విచారించారు. రఘురామకృష్ణ రాజు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రొత్సహిస్తున్నారనే సమాచారం పై ప్రాథమిక విచారణ జరిపామని ఏడీజీ సునీల్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అదంతా వాస్తవమని తేలటంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వివరించారు. ఒక పథకం, ప్రణాళిక ప్రకారం కులాల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా రఘురామకృష్ణ రాజు నిత్యం ప్రసంగాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని ఎంపీ లక్ష్యంగా చేసుకుంటున్నారని.. ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆయన ప్రసంగాలు, చర్యలు విద్వేషపూరితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. పలు మీడియా ఛానెళ్లతో కలిసి రాష్ట్రంలో సామాజిక, ప్రజాశాంతి, భద్రతలకు భంగం కలిగించేందుకు కుట్ర చేశారని ప్రకటనలో వివరించారు.

కనీసం నోటీసులివ్వరా..? : భరత్‌ ,రఘురామ కుమారుడు

ముందస్తు నోటీసులివ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ.. రఘురామ కుమారుడు భరత్‌ సీఐడీ అధికారులను ప్రశ్నించారు. కనీసం వారెంటు లేకుండా 30 మంది వచ్చి పుట్టినరోజు నాడే తన తండ్రిని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

హైకోర్టులో పిటిషన్...

తన అరెస్టు అక్రమమంటూ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. పిటీషనర్‌కు అనారోగ్య సమస్యలున్నాయని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిటిషన్‌పై నేడు విచారించనున్న న్యాయస్థానం.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పిటీషనర్‌ను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచవద్దని పోలీసులను ఆదేశించింది. ఎంపీ అనారోగ్యం దృష్ట్యా ఆహారం, మెడిసిన్స్‌, వసతి కల్పించాలని సీఐడీ పోలీసులకు సూచించింది.

ఇదీ చదవండి

ఎంపీ రఘురామ అరెస్ట్: హౌస్‌మోషన్ పిటిషన్​పై ఇవాళ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.