సీఎం జగన్ వివాహం జరిగి నేటికి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి వివాహ వేడుకలను సిమ్లాలో జరుపుకుంటున్నారు. ఈ నెల 26న గన్నవరం నుంచి సిమ్లాకు చేరుకున్న జగన్ కుటుంబ సభ్యులు.. ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈనెల 31 వరకే అక్కడే గడిపి.. సెప్టెంబర్ 1న తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.
సీఎం జగన్‌తో హిమాచల్ డీజీపీ భేటీ..
సిమ్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందు మర్యాదపూర్వకంగా కలిశారు. హిమాచల్‌ప్రదేశ్ సంప్రదాయ పద్ధతిలో టోపీ, శాలువా, జ్ఞాపికను ఆయన సీఎంకు అందించారు. సిమ్లా ఎస్పీ మోనికా భుతుంగురు కూడా జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇదీచదవండి.