ETV Bharat / city

Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా - AP CMO latest news

సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్యనేతలతో భేటీలు ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ తేదీ ఖరారు అయ్యాకే దిల్లీ వెళ్తారని సమాచారం.

Jagan
Jagan Delhi Tour cancelled
author img

By

Published : Jun 6, 2021, 6:33 PM IST

Updated : Jun 7, 2021, 2:34 AM IST

ముఖ్యమంత్రి జగన్ (cm jagan) నేటి దిల్లీ పర్యటన వాయిదా పడింది. దిల్లీలో ముఖ్య నేతల అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది. కొవిడ్ వాక్సినేషన్ (covid vaccination) బాధ్యతను కేంద్రప్రభుత్వమే తీసుకోవాలని కోరడం సహ పలు సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 3 రాజధానుల (three capitals) ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్ర సహకారం తీసుకోవడంపైనా చర్చించాలని భావించారు.

పోలవరం ప్రాజెక్టు (polavaram project) కు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులు , కొవిడ్ (covid-19) దృష్ట్యా కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amith sha) బిజీగా ఉన్న కారణంగా ఆయన అపాయింట్​మెంట్ దొరకలేదని సమాచారం. అమిత్ షాతో భేటీ ఖరారయ్యాకే సీఎం దిల్లీ వెళ్లనున్నారు. వచ్చే వారం రోజుల్లో సీఎం దిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి

Somireddy vs Kakani సోమిరెడ్డి వర్సెస్ కాకాణి @ ఆనందయ్య మందు!

Last Updated : Jun 7, 2021, 2:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.