ETV Bharat / city

TS AP WATER WAR: కృష్ణా జలాల వివాదంపై స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు - తెలంగాణ తాజా వార్తలు

ఏపీ, తెలంగాణ మద్య జల వివాదం.. వాగ్యుద్ధాల నుంచి ఫిర్యాదులు, లేఖల వరకు వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి కోసం ఏపీ.. అనుమతి వద్దంటూ తెలంగాణ.. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు లేఖలు రాశాయి. కృష్ణాబోర్డు ఈనెల 9న జరపాలని నిర్ణయించిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది.

water
water
author img

By

Published : Jul 6, 2021, 7:21 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణాజలాల వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. కేంద్రం, కోర్టులు, ట్రైబ్యునళ్లు, బోర్డు.. ఇలా అన్నింటిలోనూ ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. విద్యుదుత్పత్తి, రాయలసీమ ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, కృష్ణాబోర్డు సమావేశం.. ఇలా అన్ని అంశాలపైనా పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ కోరింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర పర్యావరణ అనుమతి మదింపు కమిటీకి లేఖ రాశారు. ఈ పథకం అటవీప్రాంతంలో కానీ, వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో కానీ లేదని, పర్యావరణ అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రికి లేఖ రాయగా, అది వన్యప్రాణి ప్రాంతంలోనే ఉందంటూ అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ తన లేఖలో జతచేసింది.

తెలంగాణ వాదన..

ఈనెల 7న పర్యావరణ మదింపు కమిటీ సమావేశం జరగనుంది. రాయలసీమ పథకానికి అనుమతి అంశం కూడా ఎజెండాలో ఉంది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ కేంద్రానికి లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీయే అనధికార ప్రాజెక్టు అని, దానికి జలసంఘం అనుమతి లేదని, అలాంటిది దాని విస్తరణ కోసం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి ఎలా ఇస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది.

ఏపీ సీఎం లేఖ..

నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అనధికార ప్రాజెక్టు అని, దానికి శ్రీశైలంలో 800 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకుంటారని, ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల తప్ప ప్రత్యామ్నాయం లేదని, అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ అనధికారికంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తోందని, కల్వకుర్తి, ఎస్‌.ఎల్‌.బి.సి. విస్తరణ చేపట్టిందని, దానిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

భేటీ వాయిదా వేయండి..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు తాగునీటి పథకం కింద అనుమతి తీసుకొని సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ ఏపీ రైతులు కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేశారు. పూర్తిస్థాయిలో జలవిద్యుదుత్పత్తికి తెలంగాణ ఇచ్చిన ఉత్తర్వు రద్దు చేయాలని కోరుతూ రైతులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణాబోర్డు ఈనెల 9న జరపాలని నిర్ణయించిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. నీటి వాటాలను సవరించడం సహా తమకు సంబంధించిన అంశాలేమీ ఎజెండాలో లేవని కృష్ణాబోర్డుకు లేఖ రాసింది.

ట్రైబ్యునల్‌లో పిటిషన్‌

రాయలసీమ పథకం పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించినా ఆంధ్రప్రదేశ్‌ వాటిని కొనసాగిస్తున్నందున ఆ రాష్ట్రంపై ధిక్కరణ చర్య తీసుకోవాలని ఎన్జీటీలో తెలంగాణ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రైబ్యునల్‌ స్వయంగా పనులను పరిశీలించాలని కోరుతూ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, హెలికాప్టర్‌ సమకూర్చుతామని తెలిపింది. పర్యావరణ అనుమతి లేకుండానే ఏపీ 1500 మంది కార్మికులతో పనులు చేయిస్తోందని, ట్రైబ్యునల్‌ ఆదేశం మేరకు కృష్ణాబోర్డు అధికారులు పరిశీలనకు వస్తామంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ రాష్ట్ర అధికారులు హెచ్చరిస్తున్నారని పేర్కొంది.

రెండు టీఎంసీలు.. సముద్రంలోకి

జూరాలకు ప్రవాహం తగ్గడంతో అక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేసి ఎత్తిపోతల పథకాలు, కాలువలకు నీటిని విడుదల చేసిన తెలంగాణ, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో మాత్రం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. పులిచింతలలో ఉత్పత్తి మరింత పెంచగా, దిగువకు వచ్చిన నీటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లు ఎత్తి దిగువకు వదిలింది. ఇప్పటివరకు 2 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది.

ఇవీచూడండి: అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.