ETV Bharat / city

కేటీఆర్ సార్.. మీకు, మీ బృందానికి కుడోస్‌ : సుమ

తెలంగాణ మంత్రి కేటీఆర్​తో సంభాషించడం ఎంతో ఆనందంగా ఉందని యాంకర్ సుమ తెలిపారు. 'ఓ హైదరాబాదీగా మన నగరం, అభివృద్ధి, తదుపరి చర్యల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని.. మీకు, మీ బృందానికి కుడోస్‌ సర్ ' అంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

suma with ktr
suma with ktr
author img

By

Published : Nov 21, 2020, 2:20 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సంభాషించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ వ్యాఖ్యాత సుమ అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం కేటీఆర్‌, ఆయన బృందం కృషి చేస్తున్న తీరు అద్భుతమని పేర్కొన్నారు. కేటీఆర్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘కేటీఆర్‌ సర్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. ఓ హైదరాబాదీగా మన నగరం, అభివృద్ధి, తదుపరి చర్యల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మీకు, మీ బృందానికి కుడోస్‌ సర్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

suma with ktr
కేటీఆర్ సార్.. మీకు, మీ బృందానికి కుడోస్‌ : సుమ

‘నేను షోలలో గడగడ ఆపకుండా మాట్లాడుతుంటా. కానీ మీ నాయకత్వం నన్ను శ్రద్ధగా వినేలా చేసింది. ప్రకటించడం.. అంకితభావంతో పనిచేయడం.. అమలు చేయడం మీ మార్గాలు. సూపర్‌ సర్..’ అని సుమ ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలను బట్టి చూస్తే కేటీఆర్‌ను ఆమె ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భాగ్యనగర అభివృద్ధితోపాటు వివిధ అంశాల గురించి కేటీఆర్‌ ప్రస్తావించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: గుంటూరు వైద్యుల ఘనత: అవతార్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.